![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -132 లో.. తనని రాహుల్ పట్టించుకోవడం లేదని స్వప్న ఇంట్లో అందరికి చెప్తుంది. రోజు ఇంటికి లేట్ గా రావడం.. ఇప్పుడు ఫోన్ చేసిన తియ్యట్లేదు కట్ చేస్తున్నాడు. మీరు పెళ్లి చేసి మీ బాధ్యత అయిపోయిందని అనుకుంటున్నారా? ఆ తర్వాత వాళ్ళ కాపురం ఎలా ఉందో చూడాలని మీకు లేదా అని స్వప్న అంటుంది.
ఆ తర్వాత అవును స్వప్న మీకు పెళ్లి చేసి పట్టించుకోవడం మానేసాం. దానికి తప్పు మాది. ఈ అమ్మాయి ఇంత మంది ముందు చెప్తుందంటే తను ఎంత బాధపడితే ఇలా చెప్తుందని సీతారామయ్య అంటాడు. అత్త అని పెత్తనం చెలాయించడం కాదు. అత్త చేసే బాధ్యతలు కూడా తెలుసుకోవాలని రుద్రాణిని అపర్ణ అంటుంది. వాళ్ళంతా అలా మాట్లాడుతుండగా అప్పుడే రాహుల్ వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ రాహుల్ అని రాజ్ అడుగుతాడు. పని మీద బయటకు వెళ్ళానని రాహుల్ అనగానే.. ఆఫీస్ పని మీదా? నీ పని మీద వెళ్ళవా అని రాజ్ కోపంగా అంటాడు. ఎందుకు ఇలా అడుగుతున్నారని రాహుల్ అంటాడు. ఇంట్లో భార్య ఉందని, తొందరగా రావాలని, ఆమెకు కోరికలు ఉంటాయని తెలియదా అని రాహుల్ తో సుభాష్ అంటాడు. ఏం చెప్పింది నా గురించి అని రాహుల్ అనగా.. రుద్రాణి వచ్చి రాహుల్ చెంప చెళ్లుమనిపిస్తుంది. తప్పు చేసింది కాకుండా స్వప్నని ఎందుకు అంటావని రాహుల్ ని తిట్టి.. అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళని రుద్రాణి అంటుంది. ఇకముందు నా కొడుకు తప్పు చేయకుండా నేను చూసుకుంటానని రుద్రాణి అంటుంది. మరొక వైపు కావ్య నేలపై పడుకుందనే విషయం ధాన్యలక్ష్మికి తెలియకుండా ఉండడానికి.. రాజ్ కావ్య ఇద్దరు ధాన్యలక్ష్మి వాళ్ళ గదికి వచ్చినప్పుడు కవర్ చెయ్యలేక ఇబ్బంది పడతారు.
మరొక వైపు సేటుని వెతుక్కుంటు పోలీసులు కనకం ఇంటికి వస్తారు. అర్థం లేని మీనాక్షి మాటలకు పోలీసులు చిరాకుపడతారు. సేటుని చూసారా కన్పించడం లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పోలీస్ అనగానే.. ఏమో తెలియదని కనకం అబద్ధం చెప్తుంది. మరొక వైపు రాహుల్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. మనం స్వప్నని బాగా చూసుకుంటున్నట్లు నటించాలి. లేదంటే వాళ్లకి మనమీద డౌట్ వస్తుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |